కులం పేరుతో అవ‌కాశం అడిగిన‌ నెటిజ‌న్‌..బ్రహ్మాజీ షాకింగ్ రిప్లై!

నేటి టెక్నాల‌జీ కాలంలోనూ కులం పిచ్చి పోవ‌డం లేదు. కరోనా వైరస్ కైనా మందు ఉంటుందేమో కానీ.. కనిపించ‌ని కులం అనే వ్యాధి కి మాత్రం మందు లేదు, రాదు. రాజ‌కీయాలు, పెళ్లిళ్లు, ఉద్యోగాలు.. ఇలా అన్నిటిపై కుల ప్ర‌భావం ప‌డుతోంది. కొంద‌రు కులం పేరుతో ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇక తాజాగా ఓ నెటిజ‌న్ కులం పేరుతో సినిమా అవ‌కాశం ఇవ్వాలంటూ ప్ర‌ముక క‌మెడియ‌న్ బ్ర‌హ్మాజీని కోరాడు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా ఓ నెటిజన్ ‘అన్నా నేను మన కమ్యునిటీకి చెందిన వాడని.. నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. మీ తరుపున ఏ చిన్న అవకాశం ఉన్నా నాకు ఏదో పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించగలరని మిక్కిలి కోరుకుంటున్నాను` అని బ్రహ్మాజీ ప్రొఫైల్ ఫొటో కింద కామెంట్ పెట్టాడు.

అది చూసిన బ్ర‌హ్మాజీ.. స‌ద‌రు నెటిజ‌న్‌కు దిమ్మ‌తిరిగేలా షాకింగ్ రిప్లై ఇచ్చారు. `నేను ఇండియన్‌ని.. తెలుగోడిని.. అదే నా కులం` అని పేర్కొని కులం పేరుతో అవ‌కాశం అడిగిన వాడి నోరు మూయించాడు బ్ర‌హ్మాజీ. ఇక బ్ర‌హ్మాజీ ఇచ్చిన అన్స‌ర్‌కు నెజిట‌న్లు ఫిదా అవుతూ.. ఆయ‌న‌పై పొగడ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 

Share post:

Latest