మేకప్ మెన్ కి సూపర్ స్టార్ స్పెషల్ విషెస్.!

చిత్ర పరిశ్రమలో ఎంతటి స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ అయినా సరే వారి అందర్నీ అభిమానులను ఆకట్టుకునే విధంగా మార్చేది ఒక్క మేకప్ టీంకి మాత్రమే చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా మేకప్ తో ఎంతో మాయాజాలం చేయగలిగేవారు సినీ పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు తెలిసిన ది బెస్ట్ మేకప్ మాన్ మీరే అని తన వ్యక్తిగత మేకప్ మాన్ పఠాభి గురించి చెప్పుకొచ్చారు.

నేడు తన మేకప్ మ్యాన్ పట్టాభి పుట్టినరోజు సందర్భంగా ఖలేజా సినిమా నటి వర్కింగ్ స్టిల్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా జత చేస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా మేకప్ మ్యాన్ పట్టాభిపై తన ప్రేమ, గౌరవం ఎల్లప్పుడు ఉంటాయని మహేష్ తెలియజేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ విధితమే. అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వారి హ్యాట్రిక్ సినిమాను చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు మహేష్.

Share post:

Latest