“పుష్ప” షూట్ పై న్యూ అప్డేట్…!

బన్నీ సినిమాలు అంటే తెలుగులోనే కాదు, మళయాళం, హీందీ, కన్నడలల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయన ఏ సినిమాలు చేసినా ఆ సినిమా మీద భారీ అంచనాలు అనేవి ఉంటాయి. తాజాగా బన్నీని స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ లాగా పుష్ఫ సినిమా మార్చేసింది. ఈ పుష్ప సినిమా ఓ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ తో ఈ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది.

ఆ తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పడటంతో షూటింగ్ ను మళ్లీ మొదలెట్టింది. ఈ సినిమాపై తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదటైనట్లుగా తెలుస్తోంది. ఈ రోజు నుంచి మొత్తం 45 రోజులు పాటు సినిమా షూటింగ్ జరగనుంది. ఇందులో బన్నీ సరసన రష్మికా మందన్నా నటించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు.