ఓటిటీ లో నితిన్ సినిమా..!

బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన అంధాదున్ సినిమాను యంగ్ హీరో నితిన్ మ్యాస్ర్టోగా రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నారనేది ఆ వార్త సారాంశం.

ఇందుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా పూర్తియయినట్లు సమాచారం. ఆగస్టు 15వ తేదీ నుంచి నితిన్ మ్యాస్ర్టో మూవీ స్ర్టీమ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి ఇంత వరకు చిత్ర నిర్మాతల నుంచి ఎటువంటి ప్రకటనా కూడా వెలువడలేదు. ఇక ఈ మూవీలో యంగ్ హీరో నితిన్ గుడ్డివాడిగా నటించాడు. ఇందులో అందాల బొమ్మలు తమన్నా భాటియా, నభా నటేశ్ నితిన్ తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ లో మాతృకలో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో టబు చేసిన రోల్ ను తెలుగులో మిల్కీ బ్యూటీ తమన్నా చేయనుంది.