సూర్య 40 వ చిత్రం ఫస్ట్ లుక్ రీలీజ్ ఎప్పుడంటే..?

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరో సూర్య తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన చేసిన ప్రతీ ఒక్క సినిమా ఇంకో సినిమాతోనే పొంతనే ఉండదు. మంచి స్టోరీ సెలక్షన్ తో అవుట్ స్టాండింగ్ యాక్టింగ్ తో సూర్య అన్ని రకాల ప్రేక్షకులను ఇట్టే మెప్పిస్తాడు. తాజాగా ఈ హీరో ‘సూర్య 40’ చిత్రంలో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాని పాండిరాజు డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ చిత్రంలో ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఇమ్మాన్ చిత్రానికి సంగీత స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ ను సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఇప్పటికే ‘సూర్య 40’ ఫస్ట్ లుక్ హ్యష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీంతో సూర్య అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య మణిరత్నం క్రియేషన్ లో వస్తున్న ‘నవరస అంథాలజీ’ చిత్రంలో నటిస్తూనే ఇటు వాడివసల్, 40వ చిత్రంలో నటిస్తున్నారు.

Share post:

Latest