బాలయ్య నుంచి ఫీస్ట్ ఎప్పుడంటే..?

బాలయ్య సినిమాకు ‘అఖండ’ ఆదరణ.. లాస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే?

- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలుసు. కాగా, వీరి కాంబినేషన్‌లో తాజాగా వస్తోన్న చిత్రం ‘అఖండ’. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ప్రగ్యాజైస్వాల్ నటిస్తుండగా, విలన్ రోల్ శ్రీకాంత్ ప్లే చేస్తున్నారు. ఈ ఫిల్మ్ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతుంది.

ఈ షెడ్యూల్‌లోనే క్లైమాక్స్ చిత్రీకరణ ఉంటుంది. ఇకపోతే ఈ సినిమాలో స్టైలిష్ విలన్ జగపతిబాబు కూడా ఓ మంచి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీత సమకూరుస్తుండగా, ద్వారకా క్రియేషన్స్ వారు మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సినిమాలోని మొదటి పాట వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. అఘోరగా, యంగ్ క్యారెక్టర్‌గా బాలయ్య క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

Share post:

Popular