విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూ రికార్డ్‌..ఆ ఒక్క లుక్కుతో 20 ల‌క్ష‌లు!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ లుక్ పోస్ట్ ఇప్పుడు విజ‌య్ ఖాతాలో ఓ న్యూ రికార్డ్ ప‌డేలా చేసింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 2 మిలియన్లు అంటే ఇర‌వై ల‌క్ష‌ల‌ లైక్స్‌ను సాధించింది. దీంతో సోషల్‌ మీడియాలో అత్యధిక లైక్‌లు రాబట్టుకుని దక్షిణాది చిత్రాల్లో తొలి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌గా నిలిచిరికార్డు సృష్టించింది.

Image

Share post:

Latest