ఆ హీరోయిన్‌ను ప్రేమిస్తున్నాఃవైష్ణ‌వ్‌

మెగా మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు వైష్ణ‌వ్‌తేజ్‌. ఆయ‌న న‌టించిన ఉప్పెన ఓ రేంజ్‌లో హిట్ అయింది. ఉప్పెన సృష్టించిన వసూళ్ల సునామీ అంతా ఇంతా కాదు. దీంతో యంగ్ హీరోల్లో స్టార్ గా మారిపోయాడు మెగా హీరో వైష్ణవ్. మొద‌టి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

అయితే రీసెంట్‌గా ఆయ‌న సోషల్ మీడియా వేదికగా త‌న ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన డౌట్స్ కు వైష్ణ‌వ్ క్లియ‌ర్ చేశాడు. త‌న ఫేవ‌రెట్ హీరో రజనీకాంత్ అని స్ప‌ష్టం చేశాడు వైష్ణ‌వ్‌. శివాజీ సినిమా తనకు చాలా ఇష్టమని వివ‌రించారు. అలాగే కృతిశెట్టిలో మంచి సింగర్ అని వెల్ల‌డించాడు. ప్రస్తుతం క్రిష్ డైరెక్ష‌న్‌లో ఓ పెద్ద మూవీ సినిమా చేస్తున్నాడు. అయితే ఇక తనకు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అంటే చాలా ఇష్టమని వైష్ణవ్ తెలిపాడు. సోనాక్షి ఇంటే కేవ‌లం ఇష్టం మాత్రమే కాదని, ప్రేమిస్తున్నాన‌ని చెప్పాడు.