ఉపాస‌న మ‌రో ముంద‌డుగు..ఆ హీరోల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా మెగా కొడ‌లు!

June 23, 2021 at 11:53 am

మెగా స్టార్ చిరంజీవి కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో హాస్పిట‌ల్స్ డైరెక్ట‌ర్ ఉపాస‌న గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగా కోడ‌లుగా క్రేజ్ ఉంది.. అలాగే సొంత ఇమేజ్ కూడా సంపాదించుకుంది ఉపాసన. ఇక సామాజిక కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొనే ఈమె.. తాజాగా మ‌రో మంద‌డుగు వేసింది.

వ‌ర‌ల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా అసోసియేష‌న్‌ త‌ర‌పున ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ కార్య‌క్ర‌మానికి ప్ర‌చార‌క‌ర్త‌గా మారింది. ఈ విష‌యంపై సోష‌ల్ మీడియా ద్వారా స్పందించిన ఉపాస‌న‌..`ప్రస్తుత క‌రోనా పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఫ్రంట్ లైన్ వారియర్స్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. మ‌రోవైపు అడవుల్లో వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు అట‌వీ క్షేత్ర సిబ్బంది కూడా క‌ఠిన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నారు.

అడవుల్లో పెట్రోలింగ్ చేయడానికి సగటున రోజుకు 15-20 కిలోమీటర్ల వరకు నడుస్తూ, అడవి జంతువులను లేదా వేటగాళ్ళను ఎదుర్కొనే ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోల త‌ర‌ఫున ప్ర‌చార‌క‌ర్తగా ప‌నిచేయ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా` అంటూ ట్వీట్ చేసింది.

ఉపాస‌న మ‌రో ముంద‌డుగు..ఆ హీరోల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా మెగా కొడ‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts