ట్విట్టర్ పై కొత్త కేసు..?

భారతదేశంలో కొత్త ఐటీ చట్టాల ప్రకారం స్టాట్యుటరీ ఆఫీసర్లను నియమించడంలో విఫలమైన ట్విట్టర్‌కు పెద్ద షాక్ తగిలింది. దీంతో మధ్యవర్తి హోదాను కోల్పోయింది ట్విట్టర్. ఇకపై ట్విట్టర్‌లో ఏ యూజర్ అయినా చట్టవిరుద్ధమైన, రెచ్చగొట్టే పోస్టింగ్‌లు ఐపీసీ ప్రకారం చేస్తే ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర్నుంచి టాప్ ఎగ్జిక్యూటీవ్స్ వరకు అందర్నీ పోలీసులు విచారించొచ్చు. వారిని బాధ్యులు చేయొచ్చు.

ఈ దెబ్బతో ట్విట్టర్ కేవలం అమెరికన్ ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే ఉంటుంది. ట్విట్టర్‌కు ఎలాంటి రక్షణ కవచం ఉండదు. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం ట్విట్టర్ విచారణల్ని ఎదుర్కోనుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్ లాంటివాటికి ఈ రక్షణ కవచం ఉంది. భారతదేశంలో మధ్యంతర చీఫ్ కాంప్లయెన్స్ ఆఫీసర్‌ను నియమించామని, ఆ వివరాలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు త్వరలోనే వెల్లడిస్తామని ట్విట్టర్ మంగళవారం వెల్లడించింది. అయితే ఐటీ రూల్స్‌ని అమలు చేయకపోవడం వల్ల మధ్యవర్తి హోదాను కోల్పోవాల్సి వచ్చింది.

Share post:

Popular