మోహ‌న్ బాబు కోసం రంగంలోకి దిగుతున్న సూర్య‌!

క‌లెక్ష‌న్ కింగ్‌ మోహన్ బాబు ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌తన్ బాబు ద‌ర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కన్నుట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ రాగా.. సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేసేందుకు కోలీవుడ్ మరియు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ హీరో సూర్య రంగంలోకి దిగుతున్నారు. సన్నాఫ్ ఇండియా టీజ‌ర్‌ను జూన్ 4న సూర్య స్వ‌యంగా విడుద‌ల చేయనున్నారు.

ఈ మేర‌కు చిత్ర యూనిట్ ఓ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. కాగా, సూర్య హీరోగా తెర‌కెక్కిన ఆకాశం నీ హద్దురా సినిమాలో మోహ‌న్ బాబు కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.

Share post:

Latest