త‌న‌యుడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన సోనూసూద్..వీడియో వైర‌ల్‌!

సోనూసూద్‌.. ఇప్పుడు ఈ పేరు దేశ‌వ్యాప్తంగా ఏ స్థాయిలో మారుమోగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సాయం అడగటమే ఆలస్యం.. చేతికి ఎముక లేదన్నట్టుగా సాయం అందిస్తున్నాడీయ‌న‌. ఈ క్ర‌మంలోనే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వహిస్తూ.. పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు.

ఇక పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించిన సోనూసూద్ తన కొడుక్కు ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు. జూన్ 20వ తేదీన వరల్డ్స్ ఫాదర్స్ డేను పురస్కరించుకొని కుమారుడు ఇషాంత్ సూద్‌కు మెర్సిడెజ్ బెంజ్- మేబాచ్ జీఎల్ఎస్ 600 మోడల్ కారును బహుకరించారు.

ఈ కారు విలువ అక్షరాల రూ.2.5 కోట్లు అని తెలుస్తోంది. ఇటీవలే మార్కెట్‌ లోకి వచ్చిన ఈ కొత్త మోడల్‌ బెంజ్ కారు ను గతంలోనే బుక్ చేయ‌గా.. సోనూసూద్‌ ఇంటికి నిన్న డెలవరీ అయింది. ఇషాంత్ కోసం తీసుకున్న ఈ కారు డెలవరీ అయిన వెంటనే కుటుంబ సభ్యులు అంతా కూడా టెస్ట్‌ డ్రైవ్ వెళ్లారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

Share post:

Latest