అరియానా ఇంట్లో సోహైల్ దొంగ‌త‌నం..ఏం కొట్టేశాడంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని ర‌చ్చ ర‌చ్చ చేసిన సోహైల్‌, అరియానాల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హౌస్‌లో ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీల్లా కొట్టుకుంటూ హైలైట్ అయిన వీరిద్ద‌రూ..ఎన్ని గొడవలు పడినా మంచి ఫ్రెండ్స్ అనే చెప్పాలి.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌ట‌య‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. త‌ర‌చూ క‌లుసుకుంటున్న సోహైల్, అరియానాలు ప‌లు షోల్లో కూడా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అరియానా ఇంట్లో సోహైల్ దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డాడు. ఇంత‌కీ ఏం దొంగ‌త‌నం చేశాడ‌నేగా మీ సందేహం!..అరియానా ఫేవరెట్‌ కోతి బొమ్మ చింటును కొట్టేశాడు సోహైల్.

అంతేకాదు, ఈ విష‌యాన్ని ఓ వీడియో ద్వారా తెలుపుతూ..`బిగ్‌బాస్‌లో నాకు శత్రువు ఉంది. వాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్‌ మధ్య చిచ్చు పెట్టాలంటే దీన్ని తీసుకెళ్లండి. దీన్ని అమ్మేస్తున్నా. ఎవరైనా కొనేవాళ్లుంటే ముందుకు రండి` అంటూ ఫ‌న్నీ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియోపై స్పందించిన అరియానా.. అరేయ్‌, నిన్ను చంపేస్తా.. అది అమ్మడానికి కాదు కామెంట్ పెట్టింది.

https://www.instagram.com/p/CQVOqZwlq_i/?utm_source=ig_web_copy_link

Share post:

Popular