స‌ల్మాన్ ఖాన్‌కు ఘోర అవ‌మానం..ఏం జ‌రిగిందంటే?

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌, దక్షిణాది స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా కాంబోలో తెర‌కెక్కిన చిత్రం రాధే. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్‌, దిశాప‌టానీ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఓటీటీలో విడుద‌ల చేయ‌గా.. అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. అయితే ప్లే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డం వ‌ల్ల భారీ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

ఇక థియేటర్లు ఓపెన్ కాగానే రాధే విడుదల చేస్తామని మేకర్లు ఇది వరకే ప్రకటించారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్​డౌన్​ నిబంధనలు సడలించ‌డంతో..50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పునః ప్రారంభం అయ్యాయి. దీంతో చెప్పిన‌ట్టుగానే మేక‌ర్స్ థియేట‌ర్‌లో రాధేను విడుద‌ల చేశారు. కానీ, విచిత్రంగా ఫ‌స్ట్ డే కేవలం 84 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాట.

దాంతో రూ. 6000 మాత్రమే క‌లెక్ష‌న్ వ‌చ్చింద‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న మేక‌ర్స్ కంగుతిన్నార‌ట‌. మ‌రోవైపు అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న‌ ఓ స్టార్​ హీరో సినిమాకు కేవలం 84 టికెట్లు మాత్రమే అమ్ముడ‌వ‌డం నిజంగా ఘోర అవ‌మాన‌మ‌నే అని చెప్పుకుంటున్నారు.

Share post:

Latest