నన్ను ఆనందపెట్టేది అతనొక్కడే..ఫీలింగ్స్ బ‌య‌ట‌పెట్టిన‌ రేణు దేశాయ్!

రేణు దేశాయ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఆయన పేరు ఎత్తకుండా సోలోగా బతికేస్తుంది రేణు. అలాగే కొడుకు అకీరా, కూతురు ఆధ్య బాధ్యతలను భుజాలపై వేసుకుని.. వారికి ఏ లోటు లేకుండా పెంచుతుంది.

ఇక ఈ మ‌ధ్యే సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన రేణు.. ప‌లు వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే రేణు.. త‌ర‌చూ ఏదో ఒక పోస్ట్‌తో అల‌రిస్తుంటుంది. ఇక తాజాగా కొడుకు అకీరాతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ఈ ప్రపంచంలో నన్ను చెప్పలేనంత ఆనందంలో ముంచెత్తగల ఒకే ఒక్కడు అకీరా. అతను వేసే జోకులు వింటుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లుగా ఉంటుంది. నా జోకులే నన్ను నవ్విస్తున్నట్లు ఉంటుంది అని కొడుకుపై త‌న ఎమోష‌న‌ల్ ఫీలింగ్స్ బ‌య‌ట పెట్టింది రేణు. ఇక ఈ ఫోస్ట్ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

Share post:

Latest