వంట చేస్తాన‌ని పెంట చేసిన ర‌కుల్‌..వీడియో వైర‌ల్‌!

ర‌కుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌కుల్‌.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటూ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ.

ఇక ప్ర‌స్తుతం ర‌కుల్ బాలీవుడ్‌లో బాగా బిజీగా గ‌డుపుతోంది. జాన్‌ అబ్రహాం ఎటాక్‌, ఆయుష్మాన్‌ ఖురానా డాక్టర్ జీ, అజయ్‌ దేవగన్ మేడే, థ్యాంక్‌ గాడ్ వంటి హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ర‌కుల్ వంటగదిలోకి వెళ్లినోరూరించే ప్యాన్‌కేక్స్‌ చేద్దామని స్టవ్‌ వెలిగించింది. ఇది గ‌మ‌నించిన ర‌కుల్ త‌మ్ముడు అమ‌న్..అక్క చేస్తోన్న ప్రయోగాన్ని వీడియో తీశాడు.

అయ‌తే ప్యాన్ కేక్స్ చేద్దామ‌ని వంట స్టార్ట్ చేసిన ర‌కుల్ చివ‌ర‌కు పెంట చేసింది. ర‌కుల్ చేసిన వంట‌ పూర్తిగా మాడిపోవడంతో.. అదో కొత్త డిష్‌గా త‌యారైంది. ఇక ఇందుకు సంబంధించిన‌ వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్న అమ‌న్‌..రకుల్ చేసిన స్పెషల్ డిష్ తినకపోవడమే మంచిది అయింద‌పి కామెంట్ పెట్టి అక్క ప‌రువు తీశాడు.మొత్తానికి ఈ వీడియో మాత్రం వైర‌ల్‌గా మారింది.

Share post:

Popular