ప్రత్యేక అనుమతితో అమెరికాకి ప‌య‌న‌మైన ర‌జ‌నీకాంత్!

సౌత సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు ఉద‌యం ప్రైవేట్ విమానంలో కుటుంబసభ్యులతో కలిసి అమెరికాకు ప‌య‌న‌మ‌య్యారు. నిజానికి ప్రస్తుత క‌రోనా పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే వీలు లేదు. అయిన కూడా త‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా రజినీ సెంట్రల్ గవర్నమెంట్‌కు అనుమ‌తి కోరుతూ లెటర్ రాశారు.

అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో అబ్రోడ్ పయనమయ్యారు. రజనీకాంత్ 2016 మేలో అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెక్ అప్ కోసం అమెరికాకే వెళ్తున్నారు. ఇప్పుడు కూడా రెగ్యులర్ వైద్య పరీక్షల కోసమే ర‌జ‌నీ అమెరికా వెళ్తున్నార‌ని తెలుస్తోంది.

రజనీకాంత్ జూలై 8 న తిరిగి ఇండియాకు పయనం అవుతారని తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే హాలీవుడ్ షూట్ కారణంగా నటుడు ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య ప్రస్తుతం యుఎస్ లోనే ఉన్నారు.

Share post:

Latest