అక‌ట్టుకుంటున్న శ్రీ‌విష్ణు `రాజ రాజ చోర‌` టీజ‌ర్!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ‌విష్ణు తాజా చిత్రం రాజ రాజ చోర‌. హసిత్ గోలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రవిబాబు, గంగ‌వ్వ‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పేరుకి సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌. కానీ చేసేవ‌న్నీ దొంగ‌త‌నాలు. ఉద‌యాన్నే నీటుగా ఫ్యాంటూ ష‌ర్టూ, ట‌క్కు, టై వేసుకుని వెళ్తాడు. సాయింత్రం అయ్యేసరికి కిటికీలూ త‌లుపులూ బ‌ద్ద‌లుకొట్టి త‌న చోర చాతుర్యం చూపిస్తుంటాడు శ్రీ‌విష్ణు.

ఈ విష‌యాన్ని టీజ‌ర్‌లో చూపించారు. క్రైమ్ కామెడీ జోన‌ర్ లో సాగే సినిమా అని టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. ఇక ఈ సినిమాలో పోలీస్ అధికారిగా ర‌విబాబు న‌టించాడు. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

Share post:

Latest