ప్ర‌మాదం నుండి సేవ్ అయినా పుష్ప విల‌న్..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో డైరెక్టర్ సుకుమార్ పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్‌ గా నటిస్తున్నారు. అయితే తాజాగా అతను ఈ సినిమా కోసం తెలుగు భాషను కూడా నేర్చుకుంటున్నాడు. ఇది ఇలా ఉండగా ప్ర‌స్తుతం ‘మలయాన్‌ కుంజు’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటుండ‌గా.., అనుకోకుండా ఆయ‌న‌కు భారీ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఆయ‌న ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.

‘మలయాన్‌ కుంజు’ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న నేపద్యంలో ఆయన చాలా ఎత్తు నుండి కింద ప‌డిపోయాడు. ఆ స‌మ‌యంలో భూమికి త‌గ‌ల‌కుండా చేతులు ఆయన తన బ్యాలెన్స్ చేయ‌డంతో క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. నిజానికి అంత ఎత్తు నుండి కింద ప‌డే సమయంలో చేతులు చాచి బ్యాలెన్స్ చేయ‌డం అంత ఈజీ కాదు. కాని అదృష్ట‌వ‌శాత్తు ఆ స‌మ‌యంలో సమయస్ఫూర్తితో చేయ‌డంతో బ‌తికి బ‌ట్ట‌గ‌ట్టాడు. అయితే యాక్సిడెంట్‌ లో ఆయన ముక్కుకు గాయం కావడంతో మూడు కుట్లు వేశారని, నొప్పి మానడానికి మరికొంచెం సమయం పడుతుందని డాక్టర్స్ తెలిపారు.

Share post:

Latest