చెర్రీ – పూరీ కాంబోలో సినిమా రాబోతోందా..?

June 7, 2021 at 3:26 pm

ప్రస్తుతం మెగాస్టార్ తనయుడు హీరో రామ్ చరణ్ తేజ ఆర్ఆర్ఆర్ సినిమా లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఒకవైపు ఈ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి కూడా విధితమే. అయితే ఈ రెండు సినిమాల తర్వాత హీరో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గా పేరు పొందిన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే ఆయన తెలియజేశారు. కాకపోతే, ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా పూర్తయ్యే వరకు దర్శకుడు శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించే కూడదని లైకా సంస్థ పట్టుబడుతోంది. దీంతో వీరిద్దరి సినిమా ఇప్పట్లో తెరకెక్కుతుందొ లేదో అన్న అనుమానం అందరిలో మొదలైంది.

అయితే పరిస్థితి ఇలా ఉండగా. టాలీవుడ్ ఇండస్ట్రీకి రామ్ చరణ్ తేజని ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. చిరుత సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన మరో సినిమా రాలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి పూరి జగన్నాథ్ లైగర్ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ రామ్ చరణ్ తేజ్ మధ్యలో సినిమా డిస్కషన్స్ జరుగుతున్నట్లు టాలీవుడ్ వినికిడి. అయితే ఈ విషయంలో ఎంత నిజం దాగి ఉందో అర్థం అవ్వట్లేదు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ ఇకపై కేవలం పాన్ ఇండియా సినిమాలు చేయబోతున్నట్లు అర్థమవుతోంది.

చెర్రీ – పూరీ కాంబోలో సినిమా రాబోతోందా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts