రెండో పెళ్లిపై ఓపెన్ అయిన సీనియర్ హీరోయిన్!

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన ప్రేమ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాష‌ల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రేమ‌. 2006 లో జీవన్ అప్పచు అనే వ్యాపారవేత్త పెళ్ళి చేసుకున్న ప్రేమ‌.. 2016లో అత‌డి నుంచి ప్రేమ విడాకులు తీసుకుంది.

- Advertisement -

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ నటి 2017లో ఉపేంద్ర మత్తే బా చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్ప‌డు ఈమె రెండో పెళ్లికి సిద్ధ‌మైదంటూ వార్త‌లు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. అంతేకాదు, ప్రేమ‌కు క్యాన్సర్ ఉందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా ప్రేమ ఓపెన్ అయింది.

ప్ర‌స్తుతం నేను ఒంర‌టిగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్న‌ను. నా ఆరోగ్యంపై కూడా అనేక రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఈ ఫేక్ వార్త‌ల‌ను ఎవరూ నమ్మవద్దు. నాకు ఫోనులు చేయవద్దు అని ప్రేమ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు.

Share post:

Popular