ప్ర‌ణీతను పెళ్లాడిన‌ నితిన్ రాజుకు అంత పెద్ద‌ బ్యాక్ గ్రౌండ్ ఉందా?

ప్ర‌ముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్.. నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని గ‌ప్‌చుప్‌గా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ లో ఎవరికి తెలియకుండా ఎంతోనిశ్శబ్దంగా ప్రణీత సుభాష్ పెళ్లి జరిగిపోయింది. అయితే ప్రణీత ర‌హ‌స్యంగా వివాహమాడిన నితిన్ రాజు ఎవ‌రు? అస‌లు అత‌డి బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? అన్న ప్ర‌శ్నులు ఇప్పుడు అంద‌రిలోనూ మొద‌ల‌య్యాయి.

అయితే తాజాగా సామాచారం ప్ర‌కారం.. నితిన్ రాజుకు పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంద‌ట‌. సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన ఈయ‌న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. హస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన నితిన్‌.. స్కూల్ డీ హాస్పిటాలిటీ కాలేజీలో చదువుకొన్నారు. ఇక 2011లో
నితిన్ రాజు బెంగళూరులో బ్లూ హారిజన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు.

ఈ సంస్థకు నితిన్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండ‌గా.. గత పదేళ్లుగా ఆయన వ్యాపారం దినదినాభివృద్ధితో ముందుకెళ్తున్నది. తన ప్రతిభతో అద్భుత‌మైన లాభాలతో తన సంస్థను ముందుకు నడిపిస్తూ.. హోటల్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారీయ‌న‌. ఇక నితిన్ రాజ్‌, ప్ర‌ణీత‌ల‌ది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని తెలుస్తోంది. ఒకరికొక‌రు చాన్నాళ్లుగా తెలుసని, కొందరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్ద‌రూ క‌లిశార‌ని స‌మాచారం.