వామ్మో..ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్‌కు అంత ఇస్తున్నారా?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కృతి సనన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో ఒకేసారి తెర‌కెక్క‌నుంది. అయితే ఈ భారీ బ‌డ్జెట్ చిత్రానికి ప్ర‌భాస్ కూడా గ‌ట్టిగానే పుచ్చుకుంటున్నార‌ట‌.

ఆదిపురుష్‌ కోసం టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ ప్రభాస్‌కు రూ. 50 కోట్లను రెమ్యున‌రేష‌న్‌గా ఇస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Share post:

Latest