కళ్యాణ్‌రామ్ `బింబిసార`లో ఎన్టీఆర్ కీలక పాత్ర..!?

నంద‌మూరి కాళ్యాణ్ రామ్ తాజా చిత్రం బిండిసార‌. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని చారిత్రక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ కథాంశంతో తెర‌కెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరీన్‌ ట్రెసా, సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మ‌ధ్య విడుద‌లైన బింబిసార మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టంట చ‌క్క‌ర్లు కొడుతోంది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కీల‌క పాత్ర పోషించ‌బోతున్నార‌ట‌.

అన్న కళ్యాణ్ రామ్ సక్సెస్ కోసం ఎప్ప‌టి నుంచి ఆరాట‌ప‌డుతున్న ఎన్టీఆర్‌.. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి బింబిసార మూవీలో భాగస్వామి కాబోతున్నారట. ఈ సినిమాకు అత్యంత కీలకమైన కథను పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నార‌ట ఎన్టీఆర్‌. అంటే ఈ రకంగా ఎన్టీఆర్ బింబిసారలో తన వంతు పాత్ర పోషించనున్నట్టే అవుతుంది.

Share post:

Latest