ఎన్టీఆర్ 30 సినిమాలో అనిరుధ్‌..?

దర్శకుడు కొరటాల శివతో కలిసి జూ.ఎన్టీఆర్ తన 30వ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పూర్తికాగానే తారక్ కొరటాల శివతో కలిసి సినిమా ప్రారంభించనున్నారు. మిక్కిలినేని సుధాక‌ర్, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఎన్టీఆర్ 30వ సినిమాకి దర్శకనిర్మాతలు ఎవరో తెలిసింది కానీ మిగతా ఏ విషయాలు ఇంకా వెల్లడి కాలేదు. హీరోయిన్ ఎవరు? కథ ఏంటి? సంగీత దర్శకులు ఎవరు? తారక్ రోల్ ఏంటి? ఇలా అనేక ప్రశ్నలు ఎన్టీఆర్ అభిమానుల బుర్రలను తొలిచేస్తున్నాయి.

- Advertisement -

ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేంటంటే.. జూ.ఎన్టీఆర్- కొరటాల శివ చిత్రానికి సంగీత దర్శకుడిగా త‌మిళ సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ ని ఎంపిక అయ్యారట. గత కొద్ది రోజులుగా మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక విషయంలో చర్చ నడుస్తోంది. దేవిశ్రీప్రసాద్, థమన్, అనిరుధ్.. ఈ ముగ్గురు సంగీత దిగ్గజాలలో ఎవరిని ఫైనలైజ్ చేయాలనే విషయంలో దర్శకనిర్మాతలు, తారక్ సుదీర్ఘంగా చర్చలు జరిపి.. చివరికి అనిరుధ్ ని కన్‌ఫమ్‌ చేశారని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. కాగా, ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

Share post:

Popular