నిహారిక కొడుకు ఎదుగుతున్నాడ‌ట‌..వైర‌ల్‌గా మారిన పోస్ట్‌!

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె నిహారిక.. చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నిహారిక‌.. ప్ర‌స్తుతం ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. అలాగే సినిమా క‌థ‌ల‌ను కూడా వింటోంది.

ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక.. తాజాగా నా కొడుకు ఎదుగుతున్నాడంటూ పెట్టిన‌ పోస్ట్ తెగ‌ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. పెళ్లి త‌ర్వాత వ‌చ్చిన నిహారిక ఫ‌స్ట్ బ‌ర్త్‌డేకు చైత‌న్య ఒక కుక్క పిల్ల‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ కుక్క పిల్ల‌కు బజ్ అని నామకరణం చేసిన నిహారిక‌.. దానిని సొంత కొడుకులా భావిస్తుంటుంది. తాజాగా బ‌జ్ ఫొటో షేర్ చేసిన నిహారిక‌.. నా బేబీ బాయ్ పెద్దగా అవుతున్నాడంటూ కామెంట్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ కాస్త వైర‌ల్‌గా మారింది.

Share post:

Latest