మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య గుడ్‌న్యూస్..ఆ సీక్వెల్ మూవీతో..!?

నంద‌మూరి బాల‌కృష్ణ తన‌ముడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎప్ప‌టి నుంచో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. గ‌త కొన్నేళ్లుగా అదుగో ఇదుగో అంటున్నారు కానీ, మోక్షజ్ఞ మాత్రం కెమెరా ముందుకు రాలేదు. అయితే తాజాగా ఈ విషయంపై రియాక్ట్ అయిన బాల‌య్య ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు.

తాజాగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడినా బాల‌య్య‌.. త‌న సినిమాల‌తో పాటు మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మోక్షజ్ఞ ను ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్న‌ట్టు తెలిపిన బాల‌య్య‌.. తాను నటించిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌గా మోక్షజ్ఞ సినిమా రానుందని బాలయ్య చెప్పారు.

అంతేకాదు ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం.

Share post:

Latest