మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్ట్ లో శృతి…?

శృతిహాస‌న్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే తెలుగు, త‌మిల‌, మ‌ళ‌యాళ‌, హిందీ భాష‌ల్లో స్టార్ హీరోయిన్‌గా వ‌రుస సినిమాలు చేస్తూ నేష‌న‌ల్ వైడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. ఈఅమ్మ‌డుకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మ‌రోసారి రికార్డుక్రియేట్ చేసింది. హైదరాబాద్ టైమ్స్ ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ టైటిల్ ను నెం.1 ప్లేస్ సాధించింది శృతిహాస‌న్‌

2013లో తొలిసారి ఈ టైటిల్ ను గెలుచుకొన్న శృతి.. మ‌ళ్లీ ఇప్పుడు ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఇక ఈమె త‌ర్వాత రెండో స్థానంలో అక్కినేని సమంత నిలిచింది. గతేడాది నెం.1 ప్లేస్ లో ఉండి టైటిల్ గెలుచుకుంది. ఇక మూడో స్థానంలో బుట్టబొమ్మ పూజాహెగ్డే నిలిచింది. ఈమె గ‌తేడాది నాలుగో స్థానంలో ఉంది. ఇక నాలుగో స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్, ఐదో స్థానంలో రష్మిక మందన్నా ఉన్నారు. వీరి త‌ర్వాత తాన్యాహాప్‌, నిధి అగ‌ర్వాల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్ర‌ద్ధా శ్రీనాథ్ వ‌రుస‌గా నిలిచారు.

Share post:

Latest