సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణకు తీసుకున్న చర్యలు, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల గురించి ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది. చివరిసారిగా ఏప్రిల్ 20న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ విజృంభణ క్రమంగా తగ్గుతుండటం, దేశంలో వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది.

టీకాల కొరతను అధిగమించిడానికి విదేశీ టీకాలకు కేంద్రం మరిన్ని మినహాయింపులు ఇచ్చింది. దీంతో విదేశీ టీకాలపై మోదీ కీలక ప్రకటన ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. కానీ, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినా.. మరణాలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశం కూడా ప్రధాని ప్రస్తావిస్తారని తెలుస్తోంది. బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరగడం, ఔషధాల కొరతపై తన ప్రసంగంలో మోదీ చర్చించే అవకాశం ఉంది.