తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత..? వాటిపై ఆంక్షలు త‌ప్ప‌నిస‌రి!

సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డిన క‌రోనా వైర‌స్.. గ‌త కొద్ది రోజులుగా నెమ్మ‌దిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా ఉధృతి త‌గ్గుతుండ‌డంతో.. ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఈ నెల 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ ఎత్తివేసి.. నైట్ కర్ఫ్యూను విధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ అత్యవసర భేటి కానుంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్ విష‌యంలో తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు.

అయితే లాక్‌డౌన్ ఎత్తేసినా..వివాహ వేడుకలు, అంత్యక్రియలు తదితర కార్యక్రమాలపై ఆంక్షలు ఇప్పటిలాగే అమలు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అలాగే మాస్కుల వినియోగం లాంటి రూల్స్ ను కూడా కఠినంగా అమలు చేయ‌నున్నారు. ఇక సినిమా హాళ్లుకు, బార్లుకు, పబ్బుల‌కు, క్లబ్బులకు, షూటింగ్‌లకు, పార్కులు, జిమ్‌లకు అనుమతి ఇస్తారా.? మరికొంతకాలం మూసి ఉంచుతారా.? అనేది కేబినేట్ సమావేశంలో తేలనుంది.

Share post:

Latest