`సర్కారు..` విష‌యంలో మ‌హేష్ ఫ్యాన్స్ ఆందోళ‌న‌..అసలేమైందంటే?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో విలన్‌గా సీనియర్ హీరో అర్జున్ కనిపించబోతున్నారని గత రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంలోనే మ‌హేష్ ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. అందుకు ఓ సాలిడ్ రీజన్‌ కూడా ఉంది. నటన పరంగా అర్జున్‌కి తిరుగులేదు. కానీ, గ‌తంలో ఆయ‌న నెగెటివ్‌ రోల్‌లో నటించిన లై, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో దారుణంగా ఫెయిల్ అయ్యాయి.

ఫ్లాప్‌ రికార్డ్ ఉన్న అర్జున్‌.. మహేష్ సినిమాలో చేస్తే రిజల్ట్ తేడా కొట్టేస్తుందేమో అన్న టెన్షన్‌లో ఉన్నారు ఫ్యాన్స్‌. కాగా, ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మ‌ళ్లీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ చిత్రాన్ని థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు.

Share post:

Latest