ఆక‌ట్టుకుంటున్న మ‌హేష్ మేన‌ల్లుడి `హీరో` టీజ‌ర్‌!

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేన‌ల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ గ‌ల్లా జయదేవ్ త‌న‌యుడు గ‌ల్లా అశోక్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రానికి హీరో అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

- Advertisement -

శ్రీరామ్‌ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.

అశోక్ కౌబాయ్ గా ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ తో ప్రారంభ‌మైన టీజ‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంటోంది. అలాగే ఈ టీజ‌ర్‌లో అశోక్ జోకర్ గెటప్ లో కనిపించి అందర్నీ ఆశ్యర్యపరిచాడు. ఇక మంచి యాక్షన్ సీక్వెన్స్ కూడా సినిమా ఉన్నాయ‌ని టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. మ‌రి లేట్ చేయ‌కుండా మీరూ టీజ‌ర్‌పై ఓ లుక్కేసేయండి.

Share post:

Popular