హీరో రామ్ సినిమాలో మాధవన్..?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ వరుస సినిమాలలో బిజీగా ఉండగా ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా కోసం మరో స్టార్ నటుడిని విలన్ గా పరిచయం చేయాలని డైరెక్టర్ లింగస్వామి అనుకుంటున్నారు. ఇక దీని కోసం తమిళ స్టార్ నటుడు మాధవన్ ను రిక్వెస్ట్ చేయగా వెంటనే మాధవన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. మాధవన్ తెలుగులో కూడా పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తమిళంలో ఎన్నో సినిమాలో నటించి స్టార్ నటుడిగా నిలిచాడు. ఇదిలా ఉంటే గతంలో లింగుస్వామి దర్శకత్వంలో మాధవన్ నటించగా అడిగిన వెంటనే విలన్ గా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా మాధవన్ సవ్యసాచి సినిమా లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇమాధవన్ నటించే సినిమాలో తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారనే నేపథ్యంలో ఆయనను రిక్వెస్ట్ చేశాడని తెలుస్తుంది. సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది.

Share post:

Latest