యువ హీరోతో కత్రినా ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి..?

కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్ లతో ప్రేమాయణం నడిపించారు కానీ చివరికి భగ్నప్రేమికురాలు గానే మిగిలిపోయారు. దీపికా పడుకొనే, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా ఇలా అందరూ తమ ప్రేమ విషయంలో సక్సెస్ అయి పెళ్లిళ్లు చేసుకుంటుంటే కత్రినా మాత్రం తన లవ్ లైఫ్ బాగోలేదని తీవ్ర బాధ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెండు సార్లు ప్రేమ విఫలమైనప్పటికీ కత్రినాకైఫ్ మళ్లీ ప్రేమించడానికి.. త్వరగా పెళ్లి చేసుకోవడానికి చాలా తహతహలాడుతున్నారని అప్పట్లో స్పష్టంగా అర్థమయింది. అయితే ఆ టైం తనకి రానే వచ్చిందని తెలుస్తోంది.

కత్రినాకైఫ్ యువహీరో విక్కీ కౌశల్ తో అర్ధరాత్రి రహస్యంగా మీట్ అవుతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా సెలబ్రిటీలు రహస్యంగా కలుసుకుంటే వారి మధ్య ఏదో ఉందని రూమర్స్ వస్తాయి. రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే.. వారి మధ్య ఏదో ఒక రిలేషన్ షిప్ ఉందనేది సులభంగా అర్థమవుతుంది. గత కొద్దిరోజులుగా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కూడా రహస్యంగా కలుస్తున్నారు. అడపాదడపా మీడియా కంటపడి బీటౌన్ లో హాట్ టాపిక్ అవుతున్నారు. కానీ తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని విక్కీ చెబుతున్నారు. కానీ నిప్పు లేకుండా పొగ ఎలా వస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అయితే తాజా నివేదికల ప్రకారం వారి మధ్య ప్రేమాయణం నడుస్తోందని.. త్వరలోనే అధికారికంగా వారి ప్రేమను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. పెళ్లి చేసుకునే ఉద్దేశంలో కూడా వాళ్ళు ఉన్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఈసారైనా కత్రినా తన ప్రేమ లో సక్సెస్ అయి పెళ్లి చేసుకుంటారు లేదో చూడాలి.

Share post:

Latest