కార్తికేయ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

కార్తికేయ సినిమాతో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు నిఖిల్‌. ఎనిమ‌ల్ హిప్న‌టిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని ఆ చిత్రం ద్వారా తెలుగుకి ప‌రిచ‌యం చేశారు. ఎలాంటి స్క్రిప్ట్ తీసుకున్నా కూడా సామాన్య‌ ప్రేక్ష‌కుడికి కూడా అర్థ‌మ‌య్యేలా, అల‌రించేలా త‌న పెన్ కి ప‌నిపెట్టే ద‌ర్శ‌కుడు చందు మెుండేటి మ‌రొక్క‌సారి మ‌న‌కి తెలియ‌ని కొత్త క‌థతో వస్తున్న చిత్రం `కార్తికేయ‌2`. మంచి చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్ విలువ‌లతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌. ఈ రెండు నిర్మాణ సంస్థ‌లు విడివిడిగా ఎన్నో సూప‌ర్‌ హిట్స్ అందించారు. అలాగే క‌లిసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ అందించారు. ఇప్పుడు మ‌రొక్క‌సారి నిఖిల్‌, చందు మొండేటి క్రేజీ కాంబినేష‌న్‌లో కార్తికేయ‌ 2 సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు పూర్తయింది. హిమాచల్ ప్రదేశ్ లోని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేశారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన వివ‌రాల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. తాజాగా కార్తికేయ 2 నుంచి ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. జూన్ 1న హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బర్త్ డే పోస్టర్ విడుదల చేశారు. గ‌తంలో కార్తికేయ 2కి సంబంధించిన కాన్సెప్ట్ మోష‌న్ పోస్టర్‌కి అనూహ్య స్పంద‌న ల‌భించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా నిఖిల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చాలా సీరియస్ గా ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తున్నారు నిఖిల్. Saviours Emerge in crisis అంటూ ఈ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ఆకట్టుకుంటుంది.

Share post:

Latest