కాళ భైరవపై నిహారిక కామెంట్స్ వైరల్..!

నాగ‌బాబు కుమార్తె నిహారిక కొణిదెల సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. తన సినీ ప్రాజెక్ట్‌ల గురించి అలాగే త‌న ఫ్రెండ్స్‌తో కలిసి చేసే అల్లరి గురించి ఇందులో ఉంటాయి. ఇక త‌న పెండ్లి వీడియోలు కూడా చేసిన హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇక ఆ పార్టీలో కీరవాణి కొడుకు అయిన కాళభైరవ కూడా కనిపించారు. కాగా నిహారికకు కాళ భైరవతో చిన్నతనం నుంచే ఫ్రెండ్ షిప్ ఉందని తెలిసిందే.

కాగా త‌న ఫ్రెండ్స్ అంద‌రూ క‌లిసి కాళ భైరవను ఎలా ఆటపట్టిస్తారో నిహారిక రీసెంట్‌గా వివ‌రిచారు. కాళ భైరవ ప్ర‌స్తుతం మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంత మంచి క్రేజ్ తెచ్చుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నిహారిక మాట్లాడుతూ ప్రతీసారి కలిసినప్పుడల్లా కాళ భైరవతో త‌మ ఫ్రెండ్స అంద‌రం క‌లిసి పాట పాడించుకుంటామని కాళ‌భైరవ చాలా బాగా పాడుతాడు అని నిహారిక చెప్పింది. త‌న వాయిస్ అంటే అంద‌రికీ ఇష్ట‌మ‌ని నిహారిక కామెంట్ చేశారు.

Share post:

Latest