`మా` ఎన్నిక‌లు..రేసులోకి జీవితా రాజశేఖర్..?!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ వేడెక్కిపోతోంది. ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్ రంగంలోకి దిగ‌గా.. మ‌రోవైపు మంచు వారి అబ్బాయి మంచు విష్ణు కూడా పోటీలో దిగుతున్నట్లుగా ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఈ రేసులో జీవితా రాజ‌శేఖ‌ర్ పేరు కూడా వ‌చ్చి చేరింది. ప్ర‌స్తుతం మా కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్న జీవితా రాజ‌శేఖ‌ర్ అనూహ్య నిర్ణయం తీసుకుని మా ప్రెసిడెంట్ రేసులో నిల‌వ‌బోతున్నార‌నే వార్త ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. ఒక‌వేళ నిజంగానే జీవితా రాజ‌శేఖ‌ర్ బరిలోకి దిగితే.. ఈ సారి ఎన్నిక‌లు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతాయి.