శేఖర్ కమ్ముల-ధనుష్ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

త‌మిళ స్టార్ హీరో ధునుష్‌, తెలుగు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కబోతోన్న సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్‌కు తెలుగులో ఫస్ట్‌ స్ట్రెయిట్ మూవీ ఇదే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా బ‌డ్జెట్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియాలో లెవ‌ల్‌లో తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రం కోసం నిర్మాతలు ఏకంగా 120 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్టు టాక్ న‌డుస్తోంది.

అయితే ఇప్పటివరకు శేఖర్ కమ్ముల ఇంత భారీ బడ్జెట్ సినిమా చేసింది లేదు. అయిన‌ప్ప‌టికీ నిర్మాత‌లు డేర్ చేసి సినిమా మీద 120 కోట్లు వెచ్చిస్తున్నారు అంటే ఇదేదో లవ్ స్టోరీ మాత్రమే అయ్యుండకపోవచ్చ‌ని.. కథలో ఇంకా ఏదో పెద్ద విశేషమే ఉంటుంద‌ని ప్ర‌చారం న‌డుస్తోంది.

Share post:

Latest