పెళ్లి విషయం పై స్పందించిన హీరోయిన్..?

సినీ నటి సంజనా గల్రానీ పెళ్లి చేసుకున్న విషయం బయటపెట్టేసింది. నేడు ఈ హీరోయిన్ సంచలన ప్రకటన చేసింది. తాను వివాహం చేసుకున్నట్టు ప్రకటించింది. గత ఏడాది లాక్ డౌన్ సమయంలోనే తాను పెళ్లి చేసుకున్నానని ఇప్పటి దాకా దాచిన సీక్రెట్ ను బయటపెట్టింది. బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టరైన అజీజ్ పాషాను పెళ్లాడానని చెప్పింది. పెళ్లి చేసుకున్న వెంటనే కొన్ని పోలీసు కేసులతో ఇబ్బంది పడ్డానని తెలిపింది.

అందిరినీ ఆహ్వానించి రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ ప్రస్తుత లాక్ డౌన్ వల్ల అది సాధ్యం కాలేదని చెప్పింది. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన సంజన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పోలీసుల విచారణకు కూడా ఆమె హాజరయింది. అదే సమయంలో అజీజ్ తో పెళ్లికి సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. కానీ, తనకు పెళ్లి కాలేదని ఆమె ప్రకటించింది. కానీ, ఇప్పుడు వాస్తవాన్ని ఆమె ప్రకటించింది.

Share post:

Latest