రష్మిక కోసం సొంత ఊరు వెళ్లిన అభిమాని..చివ‌ర్లో ఊహించని షాక్‌!

అభిమానులందు వీరాభిమానులు వేర‌య అని నిరూపించుకున్నాడు ఓ వ్య‌క్తి. త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌డ‌మే కాదు, నేషనల్ క్రష్ గా కూడా మారింది ర‌ష్మిక‌. ఈ క్ర‌మంలోనే ర‌ష్మిక‌కు రోజురోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వీరాభిమాని ర‌ష్మిక‌ను రియల్‌గా చూసేందుకు ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేసి ఆమె సొంత ఊరు వెళ్లిపోయారు.

అయితే ఎంతో క‌ష్ట‌ప‌డి వెళ్లిన స‌ద‌రు అభిమానికి చివ‌ర్లో ఊహించ‌ని షాక్ త‌గిలింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..తెలంగాణకు చెందిన ఆకాశ్​ త్రిపాఠి తన అభిమాన హీరోయిన్ రష్మిక​ను డైరెక్ట్‌గా చూసేందుకు.. గూగుల్ సాయంతో ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడగు జిల్లా అని తెలుసుకున్నాడు. ఆ వెంట‌నే ఆకాశ్ తెలంగాణ నుంచి మైసూరు వెళ్లే రైలు ఎక్కాడు.

ఆ తర్వాత సరకు రవాణా చేసే ఆటో ద్వారా రష్మిక స్వస్థలానికి చేరుకుని.. రష్మిక ఇల్లు ఎక్కడ అంటూ కనిపించిన ప్రతి ఒక్కరిని అడ‌గ‌డం స్టార్ట్ చేశాడు. అత‌డి ప్ర‌వ‌ర్త‌నను అనుమానించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా..వారు వ‌చ్చి ఆకాశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో ఆకాశ్ విష‌యం చెప్ప‌గా.. పోలీసులు ర‌ష్మిక షూటింగ్ కోసం ముంబై వెళ్లింద‌ని చెప్పి సదరు వ్యక్తిని వెనక్కిపంపారు. ఇక ఆకాశ్ ఎంతో క‌ష్ట‌ప‌డి కర్ణాటకకు వెళ్లిన‌ప్ప‌టికీ.. ర‌ష్మిక‌ను చూడ‌కుండానే వెనుతిరిగాడు.

Share post:

Popular