కూతురు పెళ్లి ప‌నుల్లో ఆ స్టార్ డైరెక్ట‌ర్ బిజీ బిజీ!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన శంక‌ర్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న రణవీర్ సింగ్ హీరోగా అపరిచితుడు రీమేక్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. మ‌రోవైపు ఇండియ‌న్ 2 విష‌యంలో శంక‌ర్‌కు, లైకా ప్రొడక్షన్స్ కు మ‌ధ్య వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

ఇదిలా ఉంటే.. శంక‌ర్ ఇప్పుడు త‌న కూతురు పెళ్లి ప‌నుల్లో బిజీ బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. శంక‌ర్‌కు ఇద్ద‌రు కూతుర్లు, ఒక కొడుకు కాగా.. గ‌త ఏడాదే పెద్ద కుమార్తె అదితి శంక‌ర్ నిశ్చితార్థం చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో జ‌రిగింది. ఇక పెళ్లి ఎప్పుడో జ‌ర‌గాల్సి ఉండ‌గా.. క‌రోనా అడ్డు ప‌డింది.

ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో చ‌క్క‌బ‌డుతున్న నేప‌థ్యంలో.. తమిళనాడులోని పొల్లాచిలో అదితి పెళ్లికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇక ఇప్పటికే శంకర్ పొల్లాచి చేరుకొని పెళ్లి పనులు చూసుకుంటున్నారట. వచ్చే వారం ఫ్యామిలీ మొత్తం అక్క‌డ‌కు వెళ్తార‌ని సమాచారం.

Share post:

Popular