“RRR” నటునితో దిల్ రాజు సినిమా…?

బాలీవుడ్ క్వీన్, 90వ దశకంలో కుర్రకారు నిద్రను చెడగొట్టిన అందాల భామ కాజోల్ భర్త అజయ్ దేవ్ గన్ సినీ ప్రియులకు సుపరిచితుడు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో సంచలనాలకు మారుపేరైన దిల్ రాజు అజయ్ దేవ్ గన్ తో సినిమా చేయనున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ గా పేరు తెచ్చుకున్న హీరో అల్లరి నరేశ్. మొదటి సినిమా పేరుతోనే పిలవబడుతున్న ఈ హీరోకు గత కొన్నేళ్లుగా సరైన హిట్లు రాలేదు. కానీ ఈ ఏడాది విడుదలయిన ఇంటెన్స్ కోర్ట్ డ్రామా నాంది బ్లాక్ బస్టర్గా నిలిచింది.

ఇక విషయానికి వస్తే.. టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా నాందిని హిందీలో రిమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ హీరోగా ఈ సినిమా రిమేక్ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం అజయ్ దేవ్ గన్ దర్శక ధీరుడు జక్కన్న నిర్మిస్తున్న RRR సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Share post:

Popular