పెళ్లిపీటలు ఎక్కనున్న బాలీవుడ్‌ నటి..?

బాలీవుడ్ న‌టులు వ‌రుస‌బెట్టి పెండ్లి పీఠ‌లు ఎక్కుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్‌ నటి ఎవలిన్‌ శర్మ కూడా పెండ్లి బాజాలు మోగించింది ఆమె ఇంట్లో. ఆమె ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ తుషాన్‌ భిండిని పెండ్లి చేసుకుని అంద‌రినీ ఆశ్య‌ర్యానికి గురి చేసింది. వీరి పెండ్లి పోయిన నెల మేలో జ‌రిగింది. అయితే ఈ విష‌యం కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. తాజాగా ఆ ఫొటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ఆమె త‌న అభిమానులతో ఈ విష‌యాన్ని పంచుకుని సంతోష ప‌డింది. ఈ సంద‌ర్భంగా ఆమె పెండ్లి విష‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న బెస్ట్‌ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడం కన్నా త‌న‌కు సంతోషకరమైనది విష‌యం ఇంకేది ఉండ‌ద‌ని చెప్పుకొచ్చింది. తాను పెండ్లి జీవితానికి స్వాగ‌తం పలికినందుకు ఎంతో ఎగ్జైట్‌ అవుతున్నానంటూ ఆమె అభిమానుల‌కు చెప్పుకొచ్చింది. అయితే వీరిద్దరూ 2018లో తొలిసారి ఫ్రెండ్స్‌ పార్టీలో కలుసుకున్నార‌ని తెలుస్తోంది. ఆ విధంగా మొదలైన వీరి స్నేహం చివ‌ర‌కు ప్రేమగా మారి పెండ్లి పీఠ‌లెక్కింది.

Share post:

Latest