హీరో బర్త్ డే కానుకగా ‘మిస్టర్ మేఘ’ పోస్టర్ రిలీజ్..!

June 8, 2021 at 3:55 pm

ఇప్ప‌టి త‌రం హీరోల్లో మంచి టాలెంటె ఉన్న‌ హీరో అదిత్ అరుణ్. ఈయ‌న ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో త‌న అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ రోజు అరుణ్ బర్త్‌డే కానుక‌గా ఆయన చేస్తున్న డియర్ మేఘ సినిమా పోస్ట‌ర్ విడుద‌ల‌యింది. దీంతో పాటు కథ కంచికి మనం ఇంటికి సినిమా నుంచి కూడా గిఫ్ట్ పోస్ట‌ర్ వ‌చ్చింది. ఇక దీంతో పాటే డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ మూవీ పోస్ట‌ర్ కూడా చెక్క‌ర్లు కొడుతోంది.

అయితే ఇందులో డియర్ మేఘ సినిమాలో మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తోంద‌ని తెలుస్తోంది. ఈ మూవీని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్స నిర్మాణ బాధ్య‌త‌లు చేస్తోంది. దీనికి సుశాంత్ రెడ్డి డైరెక్ష‌న్ చేస్తున్నాడు. ఈ రోజు వ‌చ్చిన డియర్ మేఘ పోస్టర్ కొత్త‌గా ఉండ‌టంతో అంద‌రినీ ఆకట్టుకుంటుంది. అలాగే అరుణ్ నటిస్తున్న కథ కంచికి మనం ఇంటికి సినిమా కు ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఆధ్వ‌ర్యంలో చేస్తున్నారు. పూజిత పొన్నాడ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

హీరో బర్త్ డే కానుకగా ‘మిస్టర్ మేఘ’ పోస్టర్ రిలీజ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts