నా మ‌ద్ద‌తు అతనికే అంటున్న బండ్ల..?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ బడా తలకాయలందరూ ఈ ఎన్నికలపై నజర్ పెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమాలు నిర్మించిన నిర్మాత బండ్ల గణేశ్.. చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ…. ప్ర‌కాశ్ రాజ్‌కే త‌న పూర్తి మ‌ద్ద‌తు అని ప్ర‌క‌టించారు. మాలో లోకల్, నాన్ లోక‌ల్ స‌మ‌స్య ఉత్పన్నం అయ్యే సమస్యే లేదని తెలిపారు. ప్ర‌కాశ్ రాజ్ వ్య‌క్తిత్వాని ఫిదా అయ్యే ఆయనకు మ‌ద్ద‌తు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో ప్ర‌శాశ్ రాజ్ ఎన్నో మంచి ప‌నులు చేశాడని కొనియాడారు.

న‌టుల‌కు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంద‌న్నారు. బాహుబలి ప్రభాస్ గురించి.. కూడా తీసుకొచ్చాడు. తెలుగు హీరో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారని తెలిపారు. ఈ మాటలతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ప్రకాశ్ రాజ్ జాతీయ స్థాయి నటుడని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ ఏ ప్రాంతానికి చెందిన ఇండస్ర్టీకి వెళ్లినా… ఆయనకు తిరుగుండదన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. టాలీవుడ్ గొప్ప నటుల్లో ప్రకాశ్ రాజ్ కు ఎల్లప్పుడూ స్థానం లభిస్తుందని తెలిపారు.

Share post:

Popular