బాలయ్య బర్త్ డే నా రానున్న అప్డేట్స్ ఇవే..!

జూన్‌ 10వ తేదీన నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గ రోజు అనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు బాల‌కృష్ణ పుట్టిన‌రోజు. బ‌ర్త్ డే సంద‌ర్భంగా బాల‌కృష్ణ నుంచి పెద్ద అనౌన్స్ మెంట్స్ ఉంటాయ‌ని ఫ్యాన్స్ ఎక్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బాల‌కృష్ణ నుంచి చాలా ప్ర‌క‌ట‌న‌లు ఉంటాయ‌ని ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. గోపీచంద్ మ‌లినేని, బాల‌య్య కాంబోలో సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

బ‌ర్త్ డే రోజు దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ట‌. అంతేకాదు అనిల్ రావిపూడితో చేయ‌బోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా అదే రోజు వ‌స్తుంద‌ని టాక్‌. మ‌రోవైపు బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్ లో చేస్తున్న అఖండ సినిమా నుంచి మ‌రో పోస్ట‌ర్ కూడా విడుద‌ల అవుతుంద‌ని తెలుస్తోంది. కొంత‌కాలంగా గ్యాప్ తీసుకున్న బాల‌య్య ఈ సారి మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంట‌ర్ టైన్ చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది.

Share post:

Latest