అది ఉంటేనే ఛాన్సులు వ‌స్తాయి..అంజ‌లి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

ఫోటో అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరోయిన్ అంజ‌లి..షాపింగ్‌మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం త‌ర్వాత అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటూ.. వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుంది. ఇక తెలుగులోనే కాకుండా..త‌మిళ చిత్రాల్లో కూడా న‌టించి తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది.

అయితే మునుప‌టితో పోలిస్తే.. ఈ బ్యూటీ జోరు ప్ర‌స్తుతం త‌గ్గింద‌నే చెప్పాలి. దీంతో ఈమెకు అవ‌కాశాలు త‌గ్గాయంటూ వార్త‌లు ఊపందుకున్నాయి. ఇక చాలా కాలం త‌ర్వాత‌ వకీల్ సాబ్‌తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న అంజ‌లి..అవకాశాలు రావట్లేదన్న వార్తలపై రియాక్ట్ అవుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ఇండస్ట్రీలో ఛాన్స్‌లు రావాలంటే టాలెంట్‌ ఉండాలి… నీకు టాలెంట్‌ ఉంటే, అవకావాలు అవే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పుకొచ్చిన అంజ‌లి.. మిగతా హీరోయిన్స్‌ చేస్తున్న క్యారెక్టర్స్ నాకొస్తే బాగుండనుకోవటం కూడా కరెక్ట్ కాదు. అది కంప్లీట్‌గా మేకర్స్ ఛాయిస్‌. వాళ్లు క్యారెక్టర్‌కు ఎవరు కరెక్ట్‌ అనుకుంటే వాళ్లనే పిక్ చేసుకుంటారన్నార‌ని తెలిపింది. మొత్తానికి వేదాంతాలు ప‌లకుతున్న ఈ అమ్మ‌డు.. ఇప్ప‌టి నుంచై స్పూడు పెంచుతుందేమో చూడాలి.

Share post:

Latest