ఆధార్ – పాన్ కార్డ్ లింక్ గడువు పెంపు..!

ప్ర‌తి ఒక్క‌రికీ పాన్ కార్డు ఎంతో ముఖ్యం. అయితే ప్ర‌తి ఒక్క‌రూ ఆధార్‌కార్డుతోత‌మ పాన్ కార్డును లింక్ చేయ‌డం కంప‌ల్స‌రీ. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పాన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేయ‌డానికి సెప్టెంబరు 30 వరకు గడువును పొడిగిస్తున్నట్టు తాజాగా ఆ శాఖ ప్ర‌క‌టించింది. ఈ గ‌డువు జులై 30వ‌ర‌కు ముగియాల్సి ఉండ‌గా దీన్ని మ‌రో 30రోజులు పొడింగించింది. అయితే SMS ద్వారా కూడా ఆధార్ లింక్ చేసుకోవచ్చు. లేదా మీ ఖాతా ఉన్నటు వంటి బ్రాంచ్‌కు వెళ్లి దీన్ని లింక్ చేసుకోవ‌డం సుల‌భం.

సెక్షన్ 139 ఏఏ ప్రకారం ప్రతి వ్య‌క్తి త‌న ఆదాయ వివరాల అప్లికేష‌న్ పత్రంలోనూ పాన్ కార్డు అలాగే ఆధార్ నెంబరు ఎంట‌ర్ చేయ‌డం తప్పనిసరిగా ఉంది. దీని ద్వారా ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు సెప్టెంబరు 30 తర్వాత చెల్లుబాటు అయ్యే అవ‌కాశం లేదని ఇప్ప‌టికే కేంద్రం ప్ర‌క‌టించింది. SMS ద్వారా మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి UIDAIPAN అని టైప్​ చేసి మీ 12 నెంబ‌ర్ల ఆధార్ సంఖ్యను ఎంటర్​ చేయాలి. దాని త‌ర్వాత తర్వాత స్పేస్​ ఇచ్చి పాన్​ కార్డు నెంబర్​ను రాయండి. ఈమెసేజ్‌ను 567678 లేదా 56161 నంబర్​కు సెండ్ చేస్తే మీ పని పూర్తయినట్లేనండి.