జులైలో రానున్న మహేష్ సినిమా..?

June 26, 2021 at 12:30 pm

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా, మహానటిగా మెప్పించి జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రంపై మహేశ్ అభిమానుల్లో భారీ అందచనాలు నెలకొని ఉన్నాయి. గీతగోవిందం చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా… ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ కూడా ప్రారంభించిందట. కరోనా రక్కసి ఈ చిత్రానికి కూడా బ్రేకులేసింది. దీంతో యూనిట్ షూటింగ్ కు విశ్రాంతినిచ్చారు. చిత్ర విడుదలపై ఈ ప్రభావం తప్పక పడనుందని తెలుస్తోంది.

మరలా ఇప్పుడు ఈ చిత్ర షూటింట్ మళ్లాఈ మొదలు కానుందని తెలుస్తోంది. రాబోయే నెలలో ఈ షూటింగ్ చేయడం కోసం యూనిట్ ప్లాన్ చేసిందట. మరిన్ని రోజుల్లోనే ఈ చిత్రాన్ని మనం సెట్స్ పై చూడనున్నాం. ఈ షెడ్యూల్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు తో పాటు ప్రధాన తారాగణం కూడా పాల్గొంటారని సమాచారం. కాగా.. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

జులైలో రానున్న మహేష్ సినిమా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts