దీదీ గూటికి 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు?!

ఇటీవ‌ల ముగిసిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజయం సాధించి అధికారంలోకి రావాల‌ని బీజేపీ భావించిన‌ప్ప‌టికీ.. చివ‌ర‌కు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీనే విజయకేతనం ఎగ‌ర‌వేసి హ్యాట్రిక్ కొట్టింది. 213 స్థానాల్లో టీఎంసీ విజయదుందుభి మోగించ‌గా.. బీజేపీ 77 స్థానాల‌తో స‌రిపెట్టుకుంది.

అయితే టీఎంసీ గెలుపుతో.. బీజేపీ నేత‌లు ఎప్పుడెప్పుడు దీదీ గూటికి చేరిపోదామా అని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నార‌ట‌. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి తృణమూల్‌లో చేరాల‌ని భావిస్తున్నార‌ట‌.

బీజేపీ త‌ర‌ఫున ఎన్నికైన 33 మంది ఎమ్మెల్యేల‌తో పాటు ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు ముకుల్ రాయ్ త‌న‌యుడు సుభ్రాంశు రాయ్ కూడా టీఎంసీలో చేరేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest